NewsWaves.news

మోడీ పాలనలో పూర్తిగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ…. రాహుల్ గాంధీ

Rahul Gandhi-news waves

త్వరలో జరిగే ఎన్నికలలో బిజెపి పార్టీ పరాజయం పొందడం ఖాయమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లడించారు.మోడీ పాలనా కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది అని ఆరోపించారు రాహుల్.

ఇక పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపింది అని ఆయన అన్నారు.అవినీతిపై చర్చకి ప్రధాని మోదీకి అస్సలు సమయమే లేదు అని ఆయన ఎద్దేవా చేశారు. ఉపాధి పై మోడీ మౌనం వహిస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు.

ఇక రాఫెల్ డీల్ లో మోడీ 30 వేల కోట్లు మోసం చేశారు అంటూ ఆరోపించిన రాహుల్… ఉగ్రవాదాన్ని ప్రధాని మోదీ కంటే సమర్థవంతంగా తాము ఎదుర్కొంటామని అని ప్రకటించారు. ఇక ఇండియన్ ఆర్మీ మోడీ ఆస్తి కాదు అంటూ వ్యాఖ్యానించారు రాహుల్.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి