NewsWaves.news

జగన్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివ కుమార్ ను సస్పెండ్ చేయగా.. ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన తనను పార్టీ నుంచి బహిష్కరించే అధికారం ఎవరికీ లేదంటూ శివకుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

2009 వ సంవత్సరంలో శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అనంతర రాజకీయ పరిణామాల వల్ల పార్టీని జగన్ కి అప్పగించారు. అప్పటి నుండి పార్టీ ప్రెసిడెంట్ గా జగన్.. గౌరవ అధ్యక్షురాలిగా జగన్ తల్లి విజయమ్మ కొనసాగుతున్నారు. శివ కుమార్ కూడా పార్టీలో క్రియా శీలకంగానే ఉన్నారు.

కానీ అనూహ్యంగా శివ కుమార్ ను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. శివ కుమార్ చేసిన ఫిర్యాదుతో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మార్చి 11వ తేదీ లోపు ఎన్నికల కమీషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని జగన్ ను ఎన్నికల సంఘం ఆదేశించింది.

Related Articles