NewsWaves.news

కేసీఆర్ కు ఈసీ నోటీసులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. హిందువులను కించపరిచేవిధంగా కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారంటూ విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు చేసిన ఫిర్యాదు పై ఈ నోటీసులు జారీ చేసింది.

గత నెల 17న కరీంనగర్‌ బహిరంగ సభలో హిందువులనుద్దేశించి కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేసీఆర్‌ ఉల్లంఘించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి