NewsWaves.news

విడుదలైన డీఎస్సీ పలితాలు…

ఏపీ డీఎస్సీ 2018 ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. జిల్లాల వారీగా, సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టుని అనౌన్స్ చేశారు మంత్రి. వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 81.85 ఉత్తీర్ణత నమోదు కాగా.. ఎంపికైన వారికి మే 15న నియామక పత్రాలు అందజేయనున్నారు.

ఈ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ లో మొదటి స్థానం విశాఖపట్నానికి చెందిన పుణ్యవతి సాహు కైవసం చేసుకోగా, ఫిజిక్స్ లో మొదటి స్థానం తూర్పుగోదావరికి చేందినటువంటి కనకరాజు అనిశెట్టి, బయాలజీ లో మొదటి స్థానాన్ని ప్రకాశం జిల్లాకు చెందినటువంటి పాణ్యం వెంకట సుధీర్ కుమార్, సోషల్ లో మొదటి స్థానం పశ్చిమ గోదావరికి చెందినటువంటి నీలం మణికంఠ అలాగే ఇంగ్లీషులో గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి మల్లవలపు ప్రభాకర్ బాబు మొదటి స్థానంలో నిలిచినట్లుగా మంత్రి వెల్లడించారు.

ఇదిలా ఉండగా నోటిఫికేషన్ విడుదలైన రోజు నుండి కేవలం 110 రోజుల్లోనే రిజల్ట్ అని అనౌన్స్ చేయడం డిఎస్సీ చరిత్రలోనే ఇదే మొదటిసారి అవ్వడం గమనార్హం.

Related Articles