NewsWaves.news

“దొరసాని” ఎప్పుడు వస్తుందో తెలుసా?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం పేరు దొరసాని. దొరసాని చిత్రంలో మరో విశేషం రాజశేఖర్ జీవితల రెండో కూతురు శివాత్మిక హీరోయిన్ గా పరిచయం అవుతుంది. తెలంగాణ నేపథ్యంలో జరిగే ఎమోషనల్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. సినిమాకు కె.వి.ఆర్ మహేంద్ర దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది.

నిర్మాతలు యష్ రంగినేని, మధుర శ్రీధర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు .ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది .ఈ సినిమాను జులై 5న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతుంది.వచ్చే వారము ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉంది. విభిన్న కథాంశంగా రాబోతున్న చిత్రం పట్ల అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి