NewsWaves.news

పాకిస్తాన్‌తో పెట్టుకోకండి అంటూ ఇమ్రాన్ ఖాన్ ఫేస్‌బుక్ పోస్ట్‌

పుల్వామా దాడికి ఖండించ‌డం మానేసి తిరిగి భార‌త్‌పై అక్క‌సు వెల్ల‌గ‌క్కుతున్నాడు పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్. ఇటీవ‌లే ఒక వీడియోలో పుల్వామా దాడికి పాకిస్తాన్‌కు లింకు ఉంద‌ని ఆధారాలు చూపించండి…కాని ఆధారాలు లేకుండా నిందించకండి… ఏ స‌మ‌స్య అయినా చర్చ‌ల‌తో తేల్చుకోవ‌డానికి రెడీ అన్న ఇమ్రాన్ ఖాన్‌.. అదే నోటితో మీరు యుద్ధానికి రెడీ అయితే మేము కూడా వెన‌క్కి త‌గ్గము అని కూడా అన్నాడు.

ఒక వైపు శాంతి గురించి మాట్లాడుతూ..మ‌రోవైపు యుద్ధం గురించి మాట్లాడిన ఇమ్రాన్ అక్క‌డితో ఆగ‌కుండా… నా దేశంతో పెట్టుకోకండి అంటూ ప్ర‌త్య‌క్షంగా వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ పోస్ట్ చూసి భార‌తీయుల ర‌క్తం మ‌రిగిపోతోంది. ఎలాంటి స‌మ‌యంలో ఏ మాట్లాడాలో కూడా తెలియ‌ని వ్య‌క్తి పీఎం అవ్వ‌డం ఏంటి కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles