NewsWaves.news

కశ్మీరీలను హింసించొద్దు : మాజీ సీఎం మెహబూబా

పుల్వామా ఉగ్రవాద దాడిని ఆసరాగా చేసుకొని అల్లరి మూకలు కశ్మీరీ ప్రజలను హింసించవద్దని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి అభిప్రాయపడ్డారు. “పుల్వామా ఉగ్రవాద దాడి వల్ల కలుగుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ.. దీన్ని ఆసరాగా చేసుకొని కొన్ని అల్లరి మూకలు కాశ్మీర్ ప్రజలను హింసించడానికి ప్రయత్నిస్తాయి. ఎవరో చేసిన తప్పుకు కాశ్మీర్ సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి. ఇలాంటి సమయంలో మనల్ని వేరు చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. మతాలు, ప్రాంతాల పేరుతో మనల్ని వేరుచేసే ప్రయత్నాలు చేస్తారు. అనుచిత కార్యక్రమాల వల్ల వాళ్ల ప్రయత్నాలకు అవకాశం ఇవ్వొద్దు” అని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు మహబూబా.

Related Articles