NewsWaves.news

తన రికార్డును తానే బ్రేక్ చేసిన ధనుష్…

ధనుష్ హీరోగా నటించిన త్రీ సినిమాలోని “వై దిస్ కొలవెరి” సాంగ్ కేవలం తమిళనాడు లోనే కాకుండా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ఇలా అన్ని చోట్ల జనాలను ఉర్రూతలూగించింది. ఇంటర్నెట్లో ఈ పాట అప్పట్లో ఒక సంచలనం. ఈ పాట వ్యూస్ తో కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఈ పాటకి 175 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

కాగా ఈ రికార్డుని ధనుష్ తాజా పాట “రౌడీ బేబీ” బద్దలు కొట్టింది. ధనుష్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన మారి 2 సినిమాలోని ఈ పాట జనవరి 2న విడుదల కాగా.. ఇప్పటివరకు 200 మిలియన్ వ్యూస్ దాటి కొత్త రికార్డుని క్రియేట్ చేసింది.యువన్ శంకర్ రాజా మ్యూజిక్, ప్రభుదేవా కొరియోగ్రఫీ,ధనుష్, సాయిపల్లవి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అన్నీ కలిపి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ పాట.

మొత్తంగా నెట్టింట్లో జనాల గుండే కొల్లగొట్టిన ఈ “రౌడీ బేబీ” పాటతో ధనుష్ తన పాత రికార్డును తానే బీట్ చేశాడు.

Related Articles