NewsWaves.news

వీడియో : షూ అమ్మ‌డానికి.. దేశ భ‌క్తిని వాడుకుంటున్న సేల్స్ మేన్‌

మార్కెట్‌లో ఎంతో మంది సేల్స్ మేన్స్ ఉన్నా.. ఒక్క సేల్స్‌మెన్ బాగా స‌క్సెస్ అవుతాడు…దానికి కార‌ణం అత‌ను జ‌నాల ప‌ల్స్‌ను బ‌ట్టి అమ్మే విధానం మార్చుతాడు. అచ్చం ఈ సేల్స్‌మెన్ లా. ఢిల్లీకి చెందిన ఈ సేల్స్‌మెన్ మార్కెట్‌లో చెప్పులు అమ్ముతుంటాడు. ప్ర‌పంచం మంట‌లో క‌లిసినా ప‌ట్టించుకోకుండా త‌న వ్యాపార‌మే ప‌ట్టించుకునే టైప్ అన్న‌మాట‌.
అందుకే దేశం మొత్తం పుల్వామా దాడి త‌ర్వాత తీవ్ర విషాదంలో ఉండి.. పాక్తిస్తాన్ ముర్దాబాద్ అంటుంటే.. ఇత‌ను మాత్రం పాకిస్తాన్ ముర్దాబాద్‌..మూడు జ‌త‌ల షూస్ 1100 రూపాయ‌ల‌కే అంటూ ఇలా మార్కెట్‌లో అర‌వ‌డం ప్రారంభించాడు.

ఈ వీడియోను ప్ర‌ముఖ ఉర్దూ క‌వి ఇమ్రాన్ ప్ర‌తాప్ గ‌ర్హీ త‌న ట్విట్ట‌ర్ ఎకౌంట్‌లో షేర్ చేశారు.

అయితే చాలా మంది ఈ వీడియో చూసి సేల్స్‌మెన్ ను ప్ర‌శంసిస్తోంటే.. కొంత మందికి దేశ భ‌క్తిని షూ అమ్మ‌డానికి వాడుకుంటావా అని గుర్రుమంటున్నారు.

Related Articles