NewsWaves.news

ప్ర‌ముఖ న‌ట‌నా శిక్ష‌కులు శ్రీనివాస దీక్షితులు క‌న్నుమూత‌

ప్ర‌ముఖ యాక్టింగ్ గురు, ఎన్నో సినిమాల్లో గెస్ట్‌ రోల్స్‌లో క‌నిపించి మెప్పించిన శ్రీనివాస దీక్షితులు ఈరోజు మ‌ర‌ణించారు. మురారీ, అత‌డు వంటి ఎన్నో సినిమాల్లో ఆయ‌న పూజారిగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. 1956 జులై 28 జ‌న్మించిన దీవి శ్రీనివాస్ దీక్షితులు రంగ‌స్థ‌ల న‌టుడిగా, న‌ట‌నా శిక్ష‌కుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ఏన‌లేని సేవ‌లు చేశారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆయ‌న ఈ రోజు గుండెపోటుతో హైద‌రాబాద్‌లోని నాచారంలో స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. ఆయ‌న భౌతిక కాయాన్ని మరి కాసేపట్లో అమీర్ పేట్‌లోని ఆయ‌న నివాసానికి తీసుకువెళ్ల‌నున్నారు.

నాచారంలో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్ లొకేషన్ లో ఉండగా హార్ట్ ఎటాక్ వచ్చినట్టుగా ప్రాథమిక సమాచారం. ఎన్నో సినిమాల్లో నటించిన దీక్షిత్ గారు అంతే అందరికీ ముందుగా గుర్తొచ్చే పాత్ర మురారి సినిమాలోని పూజారి పాత్రే. అలాగే మహేశ్ బాబు హీరోగా వచ్చిన అతడు సినిమాలోని పూజారి పాత్ర కూడా అందరికీ సుపరిచితమే.

Related Articles