NewsWaves.news

అప్ప‌టిదాకా ఫోన్ లో మాట్లాడుతున్నా… అంతలోనే ఇంత దారుణం ఊహించ‌లేదు…. .

  అప్ప‌టిదాకా త‌న‌తో ఫోన్ లో మాట్లాడిన భ‌ర్త ఇక లేడ‌ని, తిరిగి రాడ‌ని, అంతలోనే ఇంత ఘోరం జ‌రిగిపోయింద‌ని క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తోంది నీర్జా. గురువారం పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌వాదుల పాశవిక దాడిలో నేల‌కొరిగిన వీర‌జ‌వాన్ల‌లో కాన్పూర్ కు చెందిన‌ ప్ర‌దీప్ కుమార్ సీఆర్పీఎఫ్ జ‌వానుగా ప‌నిచేస్తున్నాడు.

ఆ రోజు అప్ప‌టివ‌ర‌కు భ‌ర్త త‌న‌తో ఫోన్ మాట్లాడాడని, త‌న కూతురు మాన్య ఏంచేస్తోంద‌ని అడిగాడ‌ని, ఇంకా ఏదో చెప్పేలోపే అటువైపునుంచి పెద్ద శ‌బ్దం వినిపించింద‌ని, అయితే ఇంత ఘోరం జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేద‌ని ప్ర‌దీప్ భార్య నీర్జా హృద‌య విదార‌కంగా రోదిస్తోంది. మ‌ళ్ళీ భ‌ర్త ఫోన్ చేస్తాడ‌ని ఎదురుచూస్తుంటే, ఈ దుర్వార్త వినాల్సి వ‌చ్చింద‌ని ఆమె త‌ల్ల‌డిల్లుతోంది. 
. 2004లో సీఆర్పీఎఫ్‌లో చేరిన ప్రదీప్‌ 115వ బెటాలియన్‌లో విధులు నిర్వహించేవాడు.

Related Articles