NewsWaves.news

పాక్ పై భారత్ దౌత్యపరమైన ఒత్తిడి…

పాక్ ఆర్మీ చేతిలో పట్టుబడిన భారత వింగ్ కమాండర్ అభినందన్ ను విడుదల చేసే దిశగా భారత పాక్ పై దౌత్య పరమైన ఒత్తిడి పెంచుతోంది. దౌత్య పరమైన అన్ని అంశాలను కూడా కేంద్రం పరిశీలిస్తోంది. అభినందన్ ను వెంటనే విడుదల చేయాలంటూ విదేశాంగ శాఖ పాక్ కు లేఖ కూడా వ్రాసింది. కానీ ఇప్పటివరకు పాక్ నుండి ఎటువంటి సమాధానం రాలేదు.

పాక్ గత చరిత్రను చూస్తే ఆ దేశం మాటలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో అభినందన్ ను తక్షణమే విడుదల చేయాలంటూ భారత్ డిమాండ్ చేస్తోంది.భారత్ ఉగ్రవాదం విషయంలో కఠినంగా ఉంటూనే ప్రపంచ దేశాలతో పాక్ పై ఒత్తిడి పెంచుతోంది. దాంతో పాకిస్తాన్ పై వివిధ దేశాల ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన వివిధ దేశాలు.. మసూద్ అజర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలంటూ పాక్ ని డిమాండ్ చేస్తున్నాయి.

అమెరికా పీ.ఓ.కే లో ఉగ్ర శిబిరాలపై భారత దాడులను సమర్థిస్తూ ప్రకటన చేసింది.అలాగే మసూద్ అజర్ కు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాయి.భారత్ తో యుద్ధానికి దిగకుండా పాకిస్తాన్ తక్షణమే ఉగ్రవాదాన్ని కట్టడి చేయాలని అమెరికా మరోసారి పాక్ ని కోరింది. రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Related Articles