NewsWaves.news

ఏపీలో కాంగ్రెస్ బస్సు యాత్ర

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రారంభించింది. “ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర” పేరుతో ఓ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా నుండి మొదలైన ఈ బస్సు యాత్ర మార్చి 3వ తేదీ వరకు కొనసాగనుంది.

ప్రత్యేక హోదా హామీని ప్రధానాంశంగా కాంగ్రెస్ నేతలు ఈ బస్సు యాత్ర లో ప్రస్తావించనున్నారు. తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్ పైనే చేయనున్నారని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో దారుణంగా దెబ్బతిన్న పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు ప్రత్యేక హోదా హామీని కాంగ్రెస్ నేతలు ప్రధాన అస్త్రంగా వాడనున్నారు.

Related Articles