NewsWaves.news

వైసిపి రాష్ట్ర కార్యదర్శిగా థర్టీ ఇయర్స్ఇండస్ట్రీ పృథ్వి…

తెలుగు సినీ పరిశ్రమలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గా పాపులర్ అయిన ప్రముఖ కమీడియన్ పృథ్వీ రాజ్ కి కీలక బాధ్యతలు కట్టబెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. వైసిపి రాష్ట్ర కార్యదర్శిగా పృద్వి రాజ్ కి బాధ్యతలు అప్పగించారు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

జగన్ ఆదేశాల మేరకు పృథ్విని వైసిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్టు పార్టీకి చెందిన రాష్ట్ర కార్యాలయం నుంచి శుక్రవారం నాడు అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది. కృష్ణా జిల్లాకు చెందినటువంటి బలిరెడ్డి పృధ్వీరాజ్ గత కొద్ది రోజుల నుండి వైసిపి చేసే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొనడం,అలాగే సంఘీభావం తెలపడం దానితోపాటు ఇటీవల కాలంలో వైయస్ జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్రలో కూడా పాల్గొనడం తెలిసిందే.

Related Articles