NewsWaves.news

ఆ ఇద్ద‌రు నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వి ఖ‌రారు?

తెలంగాణ మంత్రివ‌ర్గ విస్త‌రణ రేపు జ‌ర‌గ‌నుండ‌గా.. ఈ మంత్రి వ‌ర్గంలో ఎవ‌రికి చోటు ల‌భిస్తుందో అనే విష‌యంపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్ప‌టికే ఎంపికైన సభ్యుల‌తో ప్ర‌మాణ స్వీకారానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. సీఎం నుంచి ఫోన్ వ‌చ్చిన పార్టీ ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే ప్ర‌గ‌తి భ‌వ‌న్ చేరుకుంటున్నారు.

ఇందులో కొంత మందికి మంత్రి ప‌దవి ఇప్ప‌టికే ఓకే అయింద‌ని స‌మాచారం. ఇందులో క‌రీంన‌గ‌ర్ ధ‌ర్మ‌పురికి చెందిన ఎమ్మల్యే కొప్పులు ఈశ్వ‌ర్ కాగా, మ‌రొక‌రు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. ఈ ఇద్ద‌రికి ఇప్ప‌టికే ముఖ్యమంత్రి ఫోన్ చేసి పార్టీ ఆఫీస్‌కి ర‌మ్మన్నార‌ట‌. దీంతో వారు కొంత సమ‌యం క్రిత‌మే ప్ర‌గ‌తి భ‌వ‌న్ చేరుకున్నారు.

మిగితా మంత్ర‌లు విష‌యంలో రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు, కేసీఆర్ ప్ర‌క‌ట‌న అనంత‌రం ఒక క్లారిటీ రానుంది. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన రెండు నెల‌ల త‌ర్వాత మంత్రి మండ‌లి ఏర్పాటు చేస్తున్నారు ముఖ్య‌మంత్రి.

Related Articles