NewsWaves.news

తెలంగాణా వాళ్ళం సాఫ్,సీదా మాట్లాడతాం… కేటీఆర్

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయాన అక్కడ రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల స్థాయి పెరిగింది. అలాగే ప్రజల మెప్పు కోసం వారి ఓట్ల కోసం పార్టీలు అనేక వ్యూహాలను పథకాలను కూడా రచిస్తున్న సంగతి తెలిసిందే.ఇక తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వ అధినేత కేసీఆర్… ఏపీ సీఎం చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన విషయం విదితమే.

అంతేకాదు టిఆర్ఎస్,టీడీపీలు ఏ చిన్న సందర్భం వచ్చినా ఒకరినొకరు విమర్శించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేటీఆర్ చంద్రబాబుపై విమర్శలు సంధించారు. “ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో సీఎం చంద్రబాబుకి రైతులు గుర్తొస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో ఇంతకాలం అన్నదాత దుఖిఃభవ,ఇక ఇప్పుడు సుఖీ:భవ” అంటూ… సెటైర్ వేశారు కేటీఆర్.

చీకటి స్నేహాలకి,ముసుగు రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబుకే ఉందని, కుట్రలు, కుతంత్రాలు చేయడం తెలంగాణకి తెలియదని, మనసులో ఏది ఉంటే అదే సాఫ్ సీదా మాట్లాడుతామని కేటీఆర్ అన్నారు.

Related Articles