NewsWaves.news

సీఐడీ హెచ్చ‌రిక‌లు బేఖాత‌రు

కాశ్మీర్ లో ఉగ్ర‌వాదులు దాడి చేసే అవ‌కాశం ఉంద‌ని జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్ర క్రిమినల్ ఇన్విస్టిగేష‌న్ డిపార్ట్‌మెంట్(సీఐడీ) అధికారులు హెచ్చ‌రించినా, అప్ర‌మ‌త్తం చేసినా ఇంటెలిజెన్స్ అధికారులు ప‌ట్టించుకోలేదని తెలుస్తోంది. పుల్వామాలో ఉగ్ర‌వాదుల దాడి ఇంటెలిజెన్స్ వైఫ‌ల్య‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ఘ‌ట‌న‌కు ముందు ఆఫ్ఘ‌నిస్తాన్ లో కూడా జైషే మహ్మ‌ద్ ఉగ్ర‌వాదులు దాడికి పాల్ప‌డ్డారు. అక్క‌డ‌ కూడా పేలుడు ప‌దార్థాల‌తో ..నింపిన వాహ‌నంతోనే దాడి చేశారు. ఆ వీడియోను జైషే మహ్మ‌ద్ సంస్థ ఇంట‌ర్నెట్‌లో పెట్టింది.

ఆ వీడియో ప‌రిశీలించిన జ‌మ్మూ కాశ్మీర్ సీఐడీ అధికారులు  వెంట‌నే ఇంటెలిజెన్స్ వ‌ర్గాల‌కు స‌మాచారం అందించినా,  వీడియోతో పాటు మ‌రికొంత  స‌మాచారాన్ని కూడా ఇచ్చినా  ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ప‌ట్టించుకోలేదు. పుల్వామాలో కూడా  ఇదే త‌ర‌హాలో ఉగ్ర‌వాదులు దాడికి పాల్ప‌డ్డారు. శ్రీన‌గ‌ర్‌కు భారీ సంఖ్య‌లో జ‌వాన్లు వెళుతున్న‌ట్టు ఉగ్ర‌వాదుల‌కు ముందుగానే తెలియ‌డం, ఘ‌టన జ‌రిగిన ప్రాంతానికి కేవలం ప‌ది కిలోమీట‌ర్ల దూరంలోనే దాడికి పాల్ప‌డిన ఉగ్ర‌వాది అదిల్‌ అహ్మద్‌ నివాసం ఉండ‌డం కూడా ..అనేక సందేహాల‌కు ఆస్కార‌మిస్తోంది.

Related Articles