NewsWaves.news

జనసేనానికి ఓట్లు పడ్డాయి. కానీ సీట్లు రావు… చినరాజప్ప

ఏపిలో జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పెద్ద ఎత్తున ప్రభావం చూపనుందని జనసేన పార్టీ నేతలు,కార్యకర్తలు, పవన్ అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే ఈ విషయం పై స్పందించారు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఓట్లు పడ్డాయని,కానీ సీట్లు మాత్రం రావని ఆయన అభిప్రాయపడ్డారు.

జనసేన పార్టీకి యువకుల నుండి అలాగే మరికొన్ని వర్గాల వారి నుండి కూడా ఓట్లు పడ్డాయని,కానీ సీట్లు మాత్రం రావని ఆయన వెల్లడించారు. ఇన్ని సంవత్సరాల పరిపాలనా కాలంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులు తెలుగుదేశం పార్టీనే తిరిగి విజయం సాధించే దిశగా దోహదపడుతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఈ ఎన్నికలలో మహిళలు, వృద్ధులు టిడిపి పక్షాన నిలిచారని ఆయన తెలిపారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి