NewsWaves.news

ప్ర‌తీ ఉద్యోగికి రూ.62 లక్ష‌ల బోన‌స్ ఇచ్చిన‌ చైనా కంపెనీ

బోన‌స్ అంటే ఒక నెలా లేదా రెండు నెల‌లు ఇవ్వ‌డం కామ‌న్‌. కానీ చైనాకు చెందిన ఒక సంస్థ ఏకంగా ప్ర‌తీ ఉద్యోగికి రూ.62 ల‌క్ష‌ల బోన‌స్ ప్ర‌క‌టించింది. చైనాలోని నాన్‌చాంగ్ న‌గ‌రంలో ఉన్న ఆ సంస్థ కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా నిర్వ‌హించిన వేడుక‌ల్లో ప్ర‌తీ ఉద్యోగికి భారీ బోన‌స్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించింది. అన్న‌ట్టుగానే రూ.34 కోట్ల నోట్ల క‌ట్ట‌ల‌ను ప‌క్క‌న తీసి పెట్టింది. మాట ఇచ్చిన‌ట్టుగానే ప్ర‌తీ ఉద్యోగికి 60 వేల యువాన్లు (62 ల‌క్ష‌లు ) ఇచ్చింది.

ఈ బోన‌స్ తో పాటు ఒక గేమ్ షో కూడా నిర్వ‌హించారు. ఇందులో ఒక నిమిషంలో ఒక వ్యక్తి ఎంత డ‌బ్బును సేక‌రిస్తే.. ఆ డ‌బ్బు అత‌నిదే అని చెప్పారు. దీంతో ఉద్యోగులు బాగా ఎగ్జైట్ అయ్యార‌ట‌. జేబులు ఎలాగూ చాల‌వ‌ని క‌వ‌ర్ల‌లో డ‌బ్బులు నింపేసుకుని వెళ్లార‌ట‌. ఆ బోన‌స్ మీక్కూడా వ‌స్తే బాగుంటుంది అనిపిస్తోంది క‌దూ.

Related Articles