NewsWaves.news

రామ్ ని మెప్పించిన ఆ అమ్మాయిలు ఎవరో…

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ వాలెంటైన్స్ డే ని పురస్కరించుకొని హీరోయిన్ ఛార్మి ఒక కాంటెస్ట్ ని అనౌన్స్ చేసింది.

ఆ కాంటెస్ట్ పేరు “బి ఆన్ ఇస్మార్ట్ వాలంటైన్”. ఈ కాంటెస్ట్ లో భాగంగా అమ్మాయిలు ఇస్మార్ట్ శంకర్ అంటే హీరో రామ్ కి హైదరాబాది స్టైల్లో ఇస్మార్ట్ ప్రపోజల్స్ పంపించాలి. ఇలా పంపించిన అన్ని ప్రపోజల్స్ లో టాప్ 5 ప్రపోజల్స్ ని వాలెంటైన్స్ డే రోజు అనౌన్స్ చేయనున్నారు. అలా ఎంపికైనవారు సెట్స్ పైన ఇస్మార్ట్ శంకర్ ని కలవచ్చు… అంటూ చార్మి ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.అంతే కాదు ఈ కాన్సెప్ట్ కి క్రేజీ గర్ల్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చార్మి ఈ వీడియోలో తెలిపారు.

Related Articles