NewsWaves.news

సోనియాతో ముగిసిన చంద్రబాబు సమావేశం…

యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.దాదాపు 45 నిమిషాల పాటు వారి భేటీ సాగింది. కాగా ఈ సమావేశంలో వారు ఇరువురూ పలు ముఖ్యమైన విషయాలపైన చర్చించినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ ఈరోజుతో ముగియనున్న విషయం ఈ నేపథ్యంలో దేశంలో రాజకీయ పరిణామాలు కీలకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో వీరిరువురి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్డీయేతర పక్షాల కూటమికి ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలో వీరిరువురి భేటీ లో అనేక కీలకమైన అంశాలు చర్చకు వచ్చాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే చంద్రబాబు మాయావతి, అఖిలేష్ మొదలైన ప్రధాన రాజకీయ నేతలతో సమావేశమయ్యారు. ఆ సమావేశాలలో సేకరించిన అభిప్రాయాలను చంద్రబాబు సోనియాకు వివరించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఎన్నికల ఫలితాల సరళి గురించి, భవిష్యత్తులో ఇలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి మొదలైన విషయాల గురించి కీలకంగా చర్చించడం జరిగింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి