NewsWaves.news

ఉగ్రదాడి నేపథ్యం…తొలిసారి అఖిలపక్షం..

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం 40 మందికి పైగా భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న నేపథ్యంలో ఈ అంశంపై ఎలాంటి కార్యాచరణ అనుసరించాలో చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.
మోడీ ప్రభుత్వ హయాంలో ఈ తరహా అఖిలపక్ష సమావేశం జరగడం ఇదే మొదటిసారి. గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసిన అనంతరం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేసింది ఎన్డీయే సర్కార్.

ఈసారి మాత్రం ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందో చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పుల్వామా విషయంలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు.

Related Articles