NewsWaves.news

క్యాలి ఫ్లవర్ పచ్చడి

క్యాలీఫ్లవర్ చూడటానికి చాల అందంగా ఉంటుంది . అలాగే క్యాలీఫ్లవర్ తింటే టేస్ట్ కూడా అంతే సూపర్ గ ఉంటుంది . మాములుగా క్యాలీఫ్లవర్ తో బోలెడన్ని రకాల కూరలు చేస్తూవుంటాం .కానీ క్యాలి ఫ్లవర్ తో పచ్చడి కూడా చేయొచ్చని మీకు తెలుసా …

క్యాలి ఫ్లవర్ పచ్చడి కావలసిన పదార్ధాలు

1.క్యాలీఫ్లవర్

2.కారం ఒక కప్

3.ఉప్పు హాఫ్ కప్

4.కరివేపాకు కొద్దిగా

5.ఇంగువ కొద్దిగా

6.నిమ్మకాయలు 2

7.ఎండుమిర్చి 4

8.వేరుశనగ నూనె 2 కప్పులు

9.మెంతులు

10.ఆవాలు

11.చిటికెడు పసుపు

క్యాలీఫ్లవర్ ని బాగా వేడినీళ్లలో 2 నిమిషాలు పాటు ఉంచి చిన్న ముక్కలుగా చేసి తడి ఆరేవరకు ఆరనివ్వాలి .

తయారుచేసే విధానం :

స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని పాన్ వేడిన తర్వాత కొద్దిగా ఆవాలు,వన్ టీ స్పూన్ మెంతులు వేసి బాగా రోస్టుగా అంటే మెంతులు కాస్త కలర్ చైన్జ్ అయ్యేవరకు వేయించాలి . తర్వాత స్టవ్ ఆఫ్ చేసే వేరే ప్లేట్ లోకి తీసుకుని బాగా ఆరనివ్వాలి .ఆరినతర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి . మల్లి పాన్ పెట్టుకుని పాన్ వేడిన తర్వాత నూనె వేసి వేడైనా తర్వాత క్యాలి ఫ్లవర్ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి .

క్యాలి ఫ్లవర్ ను డైరెక్ట్ గ కలుపుకోవచ్చు కానీ ఒక్కోసారి ముక్కలో తడి ఆరకపోతే పచ్చడి పాడైపోతుంది కాబట్టి కాస్త నూనెలో వేయిస్తే పాడవకుండావుంటుంది . కాస్త కలర్ చైన్జ్ అయ్యేవరకు వేయించి బౌల్లోకి తీసి పెట్టుకోవాలి . అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడినతర్వాత ఆవాలు ,చిటికెడు ఇంగువ ,అలాగే ఎండు మిర్చి కరివేపాకు వేసి వేగినతర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు చల్లారేవరకు ఉంచాలి .

చల్లారిన తర్వాత క్యాలి ఫ్లవర్ ముక్కలో ఒక కప్ కారం ,హాఫ్ కప్ ఉప్పు , ఆవాలు మెంతుల పొడి ,చిటికెడు పసుపు వేసి బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి .తర్వాత కొద్దిగా నిమ్మ రసం అలాగే చలార్చి పెట్టుకున్న పోపు వేసి బాగా కలుపుకోవాలి. అంతే క్యాలి ఫ్లవర్ పచ్చడి రెడీ .. ఈ పచ్చడిని బౌల్ లో కాకుండా ఏదయినా గాజు సీసాలో ఉంచితే పచ్చడి పాడవకుండా ఉంటుంది …ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ..

Related Articles