NewsWaves.news

ముగిసిన చివరి విడత ప్రచారం.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరు దశల ఎన్నికలు ముగిశాయి .ఈ నెల 19న ఏడో దశ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రోజుతో ఏడో విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది.

8 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉత్తర ప్రదేశ్ కీలకమైన 13 లోక్ సభస్థానాలు ,పంజాబ్ లోని 13 లోక్సభ స్థానాలు, పశ్చిమ బెంగాల్ లోని తొమ్మిది లోక్ సభ స్థానాలు , బీహార్లోని 8 లోక్సభ స్థానాలు, మధ్యప్రదేశ్ లోని 8 లోక్సభ స్థానాలు , హిమాచల్ ప్రదేశ్ లో 4,జార్ఖండ్ లో 3 ,చండీగఢ్ లో ఒక స్థానానికి చివరి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో ప్రధాని మోడీ,మంత్రి రవిశంకర్ ప్రసాద్, శత్రుఘ్నసిన్హా వంటి నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు .19 న ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్ ఫలితాలు వెలువడనున్నాయి.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి