NewsWaves.news

వీకెండ్‌లో హ్యాపీనెస్ కావాలి..హోమ్‌వ‌ర్క్ కాదు : లెట‌ర్ రాసిన చిన్నారి

సీత క‌ష్టాలు సీత‌వి.. పీత క‌ష్టాలు పీత‌వి అన్న‌ట్టు.. పిల్ల‌ల క‌ష్టాలు పిల్ల‌ల‌వి..పెద్ద‌ల క‌ష్టాలు పెద్ద‌ల‌వి. పెద్ద‌వాళ్ల‌కేమో ఆఫిస్ వ‌ర్క్ టెన్ష‌న్‌.. పిల్ల‌ల‌కేమో హోమ్ వ‌ర్క్ టెన్ష‌న్. దీంతో ఆట‌పాట‌ల నుంచి దూరం అవుతున్నారు పిల్ల‌లు. ఇదే విష‌యాన్ని ఒక బుడ‌త‌డు టీచ‌ర్‌కు లెట‌ర్ రాశాడ‌ట‌. ఆ లెట‌ర్‌ను ఆ పిల్లాడి బంధువు సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడ‌ది బాగా వైర‌ల్ అయింది.

వీకెండ్‌లో స్కూల్ హోమ్ వ‌ర్క్ చేయ‌లేదు కాలిఫోర్నియాకు చెందిన ఒక పిల్లాడు. ఎందుకు చేయ‌లేదు అని టీచ‌ర్ కోప్ప‌డంతో.. ఒక లెట‌ర్ రాశాడు. అందులో నాకు వీకెండ్‌లో హోమ్ వ‌ర్క్ చేయ‌డం ఇష్టం లేదు. అందుకే చేయ‌లేదు. వీకెండ్‌లో స్నేహితుల‌తో ఆడుకుని ఎంజాయ్ చేసి స్ట్రెస్‌ను దూరం చేసుకోవాలి అనుకుంటాను. నాకు ఏది న‌చ్చితే అది చేయాలి అనుకుంటాను అని ధైర్యంగా లెట‌ర్ రాశాడు. ఈ లెట‌ర్‌తో పిల్ల‌లు హోమ్ వ‌ర్క్ విష‌యంలో ఎంత టెన్ష‌న్ ప‌డుతున్నారో ప్ర‌పంచానికి చాటిచెప్పిన‌ట్టు అయింది.

Related Articles