NewsWaves.news

రఫేల్ పై కాగ్ రిపోర్ట్.. కాంగ్రెస్ కు షాక్

రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా అవినీతి జరిగిందని, అంబానీకి దోచిపెట్టేందుకు ప్రధాని మోదీ ఈ ఒప్పందంలో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొన్ని నెలలుగా మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదిక ఎలా ఉంటుందో అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసింది.

ముఖ్యంగా కాగ్ నివేదికలో ప్రభుత్వానికి ఏమాత్రం ప్రతికూల ఫలితం వచ్చినా.. దానిని ఆసరాగా చేసుకుని మోడీ సర్కార్ పై అవినీతి ముద్ర వేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా లబ్ది పొందాలని కాంగ్రెస్ పార్టీ ఆశించింది. అయితే నిన్న రాజ్యసభలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదిక కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది.

రఫేల్ యుద్ధ విమానాలు గతంతో పోలిస్తే తక్కువ ధరకే వచ్చాయని కాగ్ తన నివేదికలో తెలిపింది. పాత ఒప్పందం తో పోలిస్తే మోదీ సర్కార్ చేసుకున్న ఒప్పందం వల్ల యుద్ధ విమానాల ధర 2.86% తగ్గిందని కాగ్ వెల్లడించింది. అంతేగాక పాత ఒప్పందంతో పోలిస్తే ప్రస్తుతం ఒప్పందం ప్రకారం తొలి 18 యుద్ధ విమానాలు ఐదు నెలల ముందే భారత్ కు చేరుతాయని కాగ్ విశ్లేషించింది.

కాగ్ నిన్న రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ నివేదికతో బీజేపీ నేతలు సంబర పడగా.. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం అయోమయంలో పడ్డాయి. ఇన్నాళ్లు రఫేల్ యుద్ధ విమానాల డీల్ లో మోడీ అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ చేసిన విమర్శలు నిజం కాదేమో అని కాగ్ రిపోర్ట్ అనంతరం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే అదునుగా బీజేపీ నేతలు కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. తమ ప్రభుత్వంపై, మోడీ నాయకత్వం పై అనవసరంగా నిందలు వేశారంటూ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తుతున్నారు కమల నాయకులు. మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక ఎవరి ఎంత లభిస్తుందో
వేచి చూడాలి మరి…

Related Articles