NewsWaves.news

బట్టర్ చికెన్

నాన్ వెజ్ అనగానే అందరు ఎక్కువగా ఇష్టపడేది చికెన్. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఏదయినా స్పెషల్ గా చేయాలని అనుకుంటాం. చికెన్ లో చాలార కాల కర్రీస్ చేస్తారు. చికెన్ లో కాస్త కొత్తగా టేస్టీ గా కర్రీ చేయాలనుకుంటున్నారా ? మ‌రి ఇంకెందుకు ఆలస్యం ..సూపర్ టేస్టీ బట్టర్ చికెన్ ఎలా తయారుచేయాలో చూసేద్దాం .

కావలసిన పదార్ధాలు :

  • ఉప్పు
  • కారం
  • అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ధనియల పొడి 2 స్పూన్లు
  • జీలకర్ర పొడి 2 స్పూన్లు
  • పచ్చి కోవా
  • బట్టర్
  • కసూరి మేతి 2 స్పూన్లు
  • కోరియండర్ పౌడర్ 2 స్పూన్లు
  • టమాటో ప్యూరీ ఒక కప్
  • ఫ్రెష్ క్రీం
  • పెరుగు ఒక హాఫ్ కప్
  • కార్న్ ఫ్లోర్ వన్ స్పూన్
  • బ్రౌన్ ఆనియన్ పొడి
  • బ్రెస్ట్ పీస్

తయారుచేసే విధానం :

1.మీదుగా చికెన్ ను బాగా కడిగి అందులో కొద్దిగా పెరుగు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి 3 లేదా 4 గంటల పాటునాననివ్వాలి .

2. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వేగిన‌ తర్వాత ఒక టేబుల్ స్పూన్ బట్టర్ వేసి అందులో కలిపి పెట్టుకున్న చికెన్ వేసి రెండువైపులా బాగా వేగనివ్వాలి. స్టవ్ కాస్త సిమ్ లో పెట్టి 15 నిమిషాలపాటు మూతపెట్టి అలాగే ఉంచాలి .

3. అప్పుడు చికెన్ బాగా సాఫ్ట్ గా ఉంటుంది. ఈ లోపు గ్రేవీ రెడీ చేసుకుందాం .ఒక బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియల పొడి , జీలకర్ర పొడి , కసురిమేతి ,కోరియండర్ పొడి ,బ్రౌన్ ఆనియన్ పొడి వేసి కొద్దిగా నీళ్ళు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి .

4. పాన్ పెట్టి వేడయినా తర్వాత ఒక స్పూన్ బట్టర్ వేసి తర్వాత అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి, ముందుగా కలిపి పెట్టుకున్న పేస్ట్ ను అందులో వేయాలి. 5 నిమిషాల సాటు వేగనివ్వాలి.

5. తర్వాత పచ్చి కోవా వేసుకుని 2 నిమిషాల తర్వాత టొమాటొ ప్యూరీ కూడా వేసి బాగా వేగినతర్వాత 15 నిమిషాలపాటు మూతపెట్టి ఉడకనివ్వాలి .

6. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి క‌లిపి.. అందులో కొద్దిగా ఫ్రెష్ క్రీం కూడా వేసి మిక్స్ చేయాలి. ఇలా 2 నిమిషాలపాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే … టేస్టీ టేస్టీ బట్టర్ చికెన్ రెడీ …

Related Articles