NewsWaves.news

అందుకే ఓడిపోయాం….బుద్దా వెంకన్న

ఏపీలో వెలువడిన ఎన్నికల ఫలితాలలో టిడిపి ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఓటమికి గల కారణాల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న.ఆంధ్రప్రదేశ్లోని పలువురు ఎమ్మెల్యేల పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన వెల్లడించారు. అయితే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేని వారిని నిర్మొహమాటంగా వైసీపీ అధినేత జగన్ తొలగించారని, కానీ చంద్రబాబు మాత్రం వ్యతిరేకత ఉందని తెలిసినా కూడా ఆ ఎమ్మెల్యేలకే టిక్కెట్లను కేటాయించారని,

అందువల్లే ఓడిపోవాల్సివచ్చిందని, లేనిపక్షంలో కచ్చితంగా విజయం సాధించే వారిమని ఆయన అన్నారు.ఇక ఆంధ్రప్రదేశ్లో కేవలం ఇరవై మూడు స్థానాలకే తెలుగుదేశం పార్టీ పరిమితం కావడం అనే విషయం అత్యంత దురదృష్టకరమైనదని తెలిపిన బుద్ధ వెంకన్న…18 గంటల పాటు కష్టపడి ప్రజలకు అనేక పథకాలను అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని వ్యాఖ్యానించారు.ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకున్నారని, అందుకే వైసిపికి ఓటు వేశారని ఆయన అన్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి