NewsWaves.news

రాజీనామా చేయనున్న బ్రిటిష్ ప్రధాని…

తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు బ్రిటిష్ ప్రధానమంత్రి థెరెసా మే. శుక్రవారం ఆమె ఈ విషయాన్ని ఎంతో భావోద్వేగ పూరితంగా ప్రకటించారు. తన రాజీనామా నిర్ణయానికి కారణం వివరిస్తూ…తన బ్రెగ్జిట్ ఒప్పందానికి మద్దతిచ్చేలా ఎంపీలను ఒప్పించలేకపోయారని, అందువల్లే కన్జర్వేటివ్ పార్టీ నేతగా జూన్ 7న రాజీనామా చేయనున్నానని ఆమె వెల్లడించారు.

థెరెసా మే రాజీనామా చేయనుండడంతో మరోసారి అధికారికంగా ఆ స్థానం కోసం పోటీ అయితే అంతవరకూ మే ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. జూన్ 7 న తాను రాజీనామా చేస్తానని, తదుపరి వారంలో కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేసే ప్రక్రియ మొదలవుతుందని ఆమె వెల్లడించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి