NewsWaves.news

ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్‌కుమార్ భ‌ర్జాత్య క‌న్నుమూత‌

ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్‌కుమార్ భ‌ర్జాత్య ఈ రోజు ముంబైలో క‌నుమూశారు. గ‌త కొంత కాలంగా స‌ర్‌. హెచ్ ఎన్ రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ ఆసుప‌త్రులో చికిత్స పొందుతున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ సినీ విశ్లేష‌కులు కోమ‌ల్ న‌హ్తా ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

కుటుంబ క‌థా చిత్రాలు తీసి మంచి విజ‌యాలు సొంతం చేసుకున్నాడు రాజ్‌కుమార్ భ‌ర్జాత్య‌. ఇందులో హ‌మ్ ఆప్కే హే కోన్‌, హ‌మ్ సాత్ సాత్ హే, వివాహ్‌, ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో వంటి చిత్రాలున్నాయి. ఆయ‌న నిర్మించిన చివ‌రి చిత్రం హ‌మ్ చార్‌.. ఫిబ్ర‌వ‌రి 15న విడుద‌లైంది.

Related Articles