NewsWaves.news

మోదీ చిత్రాల‌తో చీర‌లు.. భాజ‌పా కొత్త ఐడియాలు

లోక్ స‌భ ఎన్నిక‌లు ఎప్పుడ‌నేది ఇంకా ఒక క్లారిటీ రానప్ప‌టికీ.. అన్ని పార్టీలు ప్ర‌చారం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భార‌తీయ జన‌తా పార్టీ ఒక‌డుగు ముందు వేసి ప్ర‌ధాని మోదీని, ఆయ‌న నినాదాల‌ను, డైలాగ్స్‌ను ప్ర‌చారంలో బాగా వాడుకునేలా ప్లాన్ చేస్తోందట‌. మోదీ చిత్రం ఉన్న చీర‌ల‌తో మ‌హిళా ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించాల‌ని ప్లాన్ చేసిన నేత‌లు, ఇటీవ‌లే సూర‌త్‌కు చెందిన ఒక బ‌ట్ట‌ల వ్యాపారికి 5 ల‌క్ష‌ల చీర‌లు ఆర్డ‌ర్ ఇచ్చార‌ట‌.

అదే స‌మ‌యంలో న‌మోగ (న‌రేంద్ర‌మోదీ షార్ట్ క‌ట్ ) టైటిల్ ఉన్న టీష‌ర్టులు, కుర్తీల‌తో యూత్ ను ఆకట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంద‌ట బీజేపీ. వీటితో పాటు ప్ర‌ధాన మంత్రి మోదీని సింహం, చిరుతతో పోల్చుతూ ప్రత్యేక చీర‌లు కూడా డిజైన్ చేయిస్తున్నార‌ట‌. మోదీ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల పేర్ల‌ను కూడా డిజైన్ల‌లో భాగం చేయ‌నున్నార‌ట‌

Related Articles