NewsWaves.news

అమిత్ షా ఆదేశిస్తే పార్ల‌మెంటుకు పోటీచేస్తా….ల‌క్ష్మ‌ణ్

అమిత్ షా ఆదేశిస్తే పార్ల‌మెంటుకు  పోటీచేస్తాన‌ని తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ చెప్పారు. ఇటీవ‌ల తెలంగాణలో జ‌రిగిన  అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ప్ర‌భుత్వానికి అనుకూలంగా ఈసీ ప‌నిచేసింద‌ని ఆరోపించారు. 55 యేళ్ళ కాంగ్రెస్ పాల‌న‌లో సాధించింది ఏమీ లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 55 నెల‌ల్లో త‌మ బీజేపీ ప్ర‌భుత్వం  ప్రధాని  మోడీ నాయ‌క‌త్వంలో ఎంతో అభివృద్ధి సాధించింద‌ని, రానున్న ఎన్నిక‌ల‌లో అభివ‌ద్దే అజెండాగా ప్ర‌జ‌ల ముందుకు వెళ్తామ‌ని ల‌క్ష్మ‌ణ్ చెప్పారు.

వ‌రుస సెల‌వు రోజుల‌లో లోక్ స‌భ ఎన్నిక‌ల పోలింగ్ పెట్ట‌వ‌ద్ద‌ని, పోలింగ్ స‌మ‌యాన్ని గంట పెంచాల‌ని  ఈసీని కోరామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మార్చి 2వ తేదీ త‌ర్వాత ఎన్నిక‌ల‌లో పోటీచేసే అభ్య‌ర్ధుల ప‌రిశీల‌న జ‌రుగుతుంద‌ని చెప్పారు. ఈనెల 25న న‌ల్గొండ క్ల‌స్ట‌ర్, 26న వ‌రంగ‌ల్ క్ల‌స్ట‌ర్ ల‌లో స‌మావేశాలు ఏర్పాటుచేసి మోడీ ప‌ధ‌క ల‌బ్ధిదారుల‌తో క‌మ‌ల్ జ్యోతి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని ల‌క్ష్మ‌ణ్ చెప్పారు.

Related Articles