NewsWaves.news

తమిళనాట కొత్త పొత్తు

తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల మధ్య పొత్తు పొడిచింది. ఇప్పటికే రాష్ట్రంలో అన్నాడీఎంకే, పిఎంకె పార్టీల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో బీజేపీ కూడా ఆ కూటమిలో చేరింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు.


సమావేశం అనంతరం ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు నేతలు ప్రకటించారు. పొత్తులో భాగంగా రానున్న లోకసభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఐదు స్థానాల్లో పోటీ చేయనుంది. తమిళనాడులో 21 అసెంబ్లీ స్థానాలకు మరికొన్ని రోజుల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే కు మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

Related Articles