NewsWaves.news

బెండకాయ మసాలా కర్రీ

బెండ‌కాయ ఎంత ఆరోగ్య‌క‌ర‌మో ..అంతే రుచిక‌రంగా ఉంటుంది. పులుసులో, కూర‌లో వెజ్ ఫ్రైడ్ రైస్‌లో కూడా బెండ‌కాయ‌ను యాడ్ చేస్తుంటారు. ఇవ‌న్నీ ట్రై చేసి మీకు బోర్ కొట్టి ఉంటే మాత్రం.. ఈ రెసెపీ ట్రై చేయండి. అదే బెండ‌కాయ మ‌సాలా కర్రీ. చ‌పాతీతో తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. అయితేఎలా త‌యారు చేయాలి.. ఏం కావాలి అనేగా ఆలోచిస్తున్నారు. మ‌రి ఎందుకు ఆల‌స్యం చ‌దివేయండి… చ‌క్క‌గా వండేయండి.

బెండకాయ మసాలా కర్రీ కావాల్సిన పదార్ధాలు :

బెండకాయలు ,నూనె ఒక కప్పు ,జీలకర్ర ,ఉల్లిపాయ ముక్కలు ,అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు,పసుపు కొద్దిగా ,కారం 2 స్పూన్లు , జీలకర్ర1 స్పూన్ ,ధనియాల పొడి 1స్పూన్ ,టమాటా ముక్కలు ,పెరుగు ,ఉప్పు తగినంత ,గరం మసాలా హాఫ్ స్పూన్ .

తయారుచేసే విధానం :

  1. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసి కాస్త వేగినతర్వాత ముక్కల్ని విడిగా తీసి పక్కన పెట్టుకోవాలి . అదే పాన్ లో కాస్త నూనె వేసి అందులో జీలకర్ర ,ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త కలర్ వచ్చేవరకు వేయించాలి .
    2.తర్వాత కొద్దిగా పసుపు ,కారం, జీలకర్ర1 స్పూన్ ,ధనియాల పొడి 1స్పూన్,గరం మసాలా వేసి వేగనిచ్చి ఒక నిమిషం తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి బాగా మెత్తగా అయ్యేవరకు మగ్గనివ్వాలి .
  2. తర్వాత పెరుగు కూడా వేసి బాగా కలిపి 2 నిముషాలు మూతపెట్టి ఉడకనివ్వాలి . 2 నిమిషాల తర్వాత మూత తీసి ,ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి మరో 3 నిముషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి.
  3. ఆ గ్రేవి అంత బెండకాయ ముక్కలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది . ఇంక చివరగా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవటమే . సూపర్ టేస్టీ బెండకాయ మసాలా కర్రీ రెడీ .ఈ కర్రీ రైస్ లోకే కాకుండా చపాతీ ,పూరి లోకి కూడా చాల బావుంటుంది

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి