NewsWaves.news

బెంగళూరులో అగ్ని ప్ర‌మాదం.. 100కు పైగా కార్లు భ‌స్మం

బెంగుళూరు లో జ‌రుగుతున్న ఎయిర్‌షోపై శ‌ని వ‌క్ర‌దృష్టి ప‌డిన‌ట్టుంది. మొన్న‌టికి మొన్న రెండు విన్యాస విమానాలు గాలిలో క్రాష్ అయిన సంఘ‌ట‌న‌లో ఒక పైల‌ట్ మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈరోజు పార్కింగ్ వ‌ద్ద అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది.

మ‌హిళా స్కై డైవింగ్ జ‌రుగుతున్న చోట జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో దాదాపు 100 కార్లు కాలి బూడిద‌య్యాయి. ఈ ప్ర‌మాదం గురించి ద‌ర్యాప్తు జ‌రుపుతున్న పోలీసులు … ఎవ‌రో సిగ‌రెట్ తాగి ప‌డేయ‌డం వ‌ల్ల గ‌డ్డికి మంటలు అంటుకున్నాయ‌ని.. దాంతో అక్క‌డ ఉన్న కార్ల‌కు కూడా మంట‌లు అంటుకోవ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెబుతున్నారు.

Related Articles