NewsWaves.news

బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ఎలా ఉన్నా అందులో స్టార్ హీరోయిన్స్ మాత్రం ప‌క్కాగా ఉంటారు. ఇప్ప‌టికే స‌మంతా, త‌మ‌న్నా, ర‌కుల్ లాంటి స్టార్ హీరోయిన్స్‌ను క‌వ‌ర్ చేసిన బెల్లంకొండ.. ఇప్పుడు అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో రొమాన్స్ చేయ‌నున్నాడు. బెల్లంకొండ హీరోగా ‘రాచ్చసన్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.


ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందా అనే ఆసక్తి మొదలైంది. ఆ ఛాన్స్ అనుపమా పరమేశ్వరన్ కి దొరికినట్టు తాజా సమాచారం.

Related Articles