NewsWaves.news

ఓటమికి కారణం అతివిశ్వాసమే:వినోద్

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అధికార టీఆరెస్ కి షాక్ అని చెప్పాలి.16 అనుకున్న చోట 9 తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కవిత తో పాటు మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు కేసీఆర్ ఆప్తుడు వినోద్ కూడ పరాజయం చెందారు. అతివిశ్వాసం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైనట్లు టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్‌ అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా మోదీ హవా బీజేపీకి కలిసొచ్చిందని తెలిపారు. పుల్వామా, బాలాకోట్ ఘటనలు జాతీయవాదాన్ని మేల్కొలిపాయని చెప్పారు.

అవినీతి, నిరుద్యోగం అంశాలను ప్రజలు ఈ ఎన్నికల్లో పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో బీజేపీ విధానాలపై స్పందిస్తామన్నారు. జరిగిన లోపాలను రాబోయే రోజుల్లో సవరించుకుంటామని స్పష్టంచేశారు. తాను పదవులపై ఆశతో రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆశయంతోనే వచ్చినట్లు పేర్కొన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల సమస్యల కోసం పని చేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి