NewsWaves.news

చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు నిరాధారం : ద్వివేది

ఎన్నికల సంఘం ఎవరికీ అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌ద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది చెప్పారు. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికంగా విధులు నిర్వ‌హిస్తున్నామని, తమపై ఎవరి ఒత్తిడీ లేదని ఆయన స్పష్టం చేశారు.చంద్ర‌బాబు ఆరోప‌ణ‌లు నిరాధార‌మ‌ని , సీనియర్‌ రాజకీయ నేతగా సీఎం చంద్రబాబు అంటే గౌరవం ఉందని చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తాము అమలు చేస్తున్నామని ఆయ‌న‌ తెలిపారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ చంద్రబాబు ఈరోజు ద్వివేదిని కలిసి వినతపత్రం అందచేసి, ఈసీ కార్యాలయం వ‌ద్ద భైఠాయించి నిరసన తెలిపిన విష‌యం విదిత‌మే.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి