NewsWaves.news

మా పెళ్ళికి పెద్దన్న పద్మారావు… బాల్క సుమన్

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఎంపికైన సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ…తన పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.2012వ సంవత్సరంలో తనకు వివాహం జరిపించింది పద్మారావు అన్ననే అంటూ.. తెలిపారు సుమన్.

ఆయన పెళ్లికి అత్తమామలు ఒప్పుకోకపోవడంతో పద్మారావు మూడు నెలల సమయంలో రెండు సార్లు వారితో మాట్లాడి, చివరికి వారినొప్పించి ప్రేమ వివాహం జరిపించారని బాల్క సుమన్ తెలిపారు.అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ లో ఉన్న తనకి పద్మారావు వెన్నుదన్నుగా నిలిచారని,అనేక సందర్భాల్లో సహాయాన్ని అందించి తనకు అండగా ఉన్నారని, అటువంటి పద్మారావు కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు,కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని సుమన్ అన్నారు.

Related Articles