NewsWaves.news

ఫ్యాన్ ని పరిగెత్తించి కొట్టిన బాలకృష్ణ

నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మరో సరి అభిమానిపై చేయి చేసుకున్నాడు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలకృష్ణ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బాలకృష్ణను తన కెమెరాలో బంధించేందుకు ప్రయత్నించిన కార్యకర్తపై బాలకృష్ణ చేయి చేసుకున్నారు.

ఎన్నికల ప్రచార రథంలో వెళ్తున్న బాలకృష్ణ వీడియోను తీస్తూ దగ్గరికి వచ్చారు. తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తుండగా బాలకృష్ణ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. అనంతరం యువకుడు వెనక్కి పరుగు పెట్టాడు. అయినా బాలయ్య అతడి వెంట పరిగెత్తుకుని వచ్చి దాడి చేశాడు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి