NewsWaves.news

ప్రేమ జంటకి పెళ్లి చేసిన భజరంగ్ దళ్…

ప్రేమికుల రోజు రానే వచ్చేసింది. లవర్స్ అంతా సంవత్సరం అంతా ఎదురు చూసే రోజు ఈ లవర్స్ డే. ఈరోజు ప్రేమికులు లోకాన్ని మర్చిపోయి..ప్రేమ మైకంలో మునిగితేలుతూ ఉంటారు. దానికి తోడు హోటల్లు, రెస్టారెంట్లు.. ఇవన్నీ లవర్స్ డే సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లతో ప్రేమ జంటలకు ఆహ్వానం పలుకుతూ ఉంటాయి.

ఇక మరో వైపేమో ప్రేమ జంటలు ఎక్కడ కనిపించినా పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉంటారు భజరంగ్ దళ్ కార్యకర్తలు.వాళ్ళ కంటికి ఏ ప్రేమ జంట అయిన కనిపిస్తే అక్కడే పెళ్లి చేస్తారు కూడా. అలాంటిదే జరిగింది మేడ్చెల్ ప్రాంతంలో. మేడ్చెల్ లోని సీఎంఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న పార్క్ కి ఒక ప్రేమజంట వచ్చింది. ఆ ప్రేమ జంటని చూసిన భజరంగదళ్ కార్యకర్తలు వారిని చుట్టుముట్టి మరీ పెళ్లి జరిపించారు.

అంతేకాదు ఆ అబ్బాయి, అమ్మాయికి పసుపుతాడు కడుతుంటే వీడియో కూడా తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. కాగా ఈ వీడియోలో ఉన్న కార్యకర్తల పైన కేసు నమోదు చేస్తామని వెల్లడించారు పోలీసులు.

Related Articles