NewsWaves.news

బీజేపీ నేత బ‌ద్దం బాల్‌రెడ్డికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

భార‌తీయ జ‌నతా పార్టీ సినియ‌న‌ర్ నేత, మాజీ శాస‌నస‌భ స‌భ్యుడు బ‌ద్దం బాల్‌రెడ్డి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆయ‌న ప‌రిస్థితి విషమించ‌డం వ‌ల్ల వెంట‌నే ఆయ‌న్ను బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఈ మేర‌కు వైద్యులు అత్య‌వ‌స‌ర చికిత్స అందిస్తున్నారు.

బ‌ద్దం బాల్ రెడ్డి అనారోగ్యం విష‌యం తెలుసుకున్న బీజేపీ సినియ‌ర్ నేత కిష‌న్ రెడ్డి, లక్ష్మ‌ణ్, హాస్పిట‌ల్‌కు చేరుకున్నారు. అనంత‌రం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు. బ‌ద్దం బాల్‌రెడ్డి కార్వాన్ నియోజ‌కవ‌ర్గం నుంచి వ‌రుస‌గా మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటి చేసి గెల‌పొందారు.

Related Articles