NewsWaves.news

బీజేపీ నేత బ‌ద్దం బాల్‌రెడ్డి క‌న్నుమూత‌

భార‌తీయ జ‌నతా పార్టీ సినియ‌న‌ర్ నేత, మాజీ శాస‌నస‌భ స‌భ్యుడు బ‌ద్దం బాల్‌రెడ్డి క‌న్నుమూశారు. కొన్ని గంట‌ల క్రిత‌మే బ‌ద్దం బాల్‌రెడ్డి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆయ‌న్ను బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం వైద్యులు అత్య‌వ‌స‌ర చికిత్స చేశారు.

బ‌ద్దం బాల్ రెడ్డి అనారోగ్యం విష‌యం తెలుసుకున్న బీజేపీ సినియ‌ర్ నేత కిష‌న్ రెడ్డి, లక్ష్మ‌ణ్, వెంట‌నే హాస్పిట‌ల్‌కు చేరుకున్నారు. బ‌ద్దం బాల్‌రెడ్డి కార్వాన్ నియోజ‌కవ‌ర్గం నుంచి వ‌రుస‌గా మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటి చేసి గెలుపొందారు.

Related Articles