NewsWaves.news

బేబీ పొటాటో ఫ్రై

లైఫ్‌లో వెరైటీ కావాలి అనుకునే వాళ్లు ఆహ‌రం విష‌యంలో కూడా వెరైటీ కోరుకుంటారు. రోజూ తినే బంగాళ‌దుంప‌ల‌తో కూడా ఎన్నో వెరైటీ రెసెపీస్ సిద్ధం చేసుకోవచ్చు వెరైటీగా. అందుకే ఈ రోజు బేబీ పొటాటో ఫ్రై చేయండి వెరైటీగా. ఫ్యామిలీతో క‌లిసి ఎంజాయ్ చేయండి టేస్టీగా.

కావలసిన పదార్థాలు

  • బేబీ పొటాటోస్‌ – 12
  • నూనె – సరిపడా
  • ఎండు మిర్చి – ఒకటి
  • జీలకర్ర – ఒక టీ స్పూను
  • కరివేపాకు – 4 రెబ్బలు
  • ధనియాల పొడి – ఒక టీ స్పూను
  • పసుపు – అర టీ స్పూను
  • జీరా పొడి, కారం
  • గరం మసాల
  • ఆమ్‌చూర్‌ పొడి – ఒక్కో టీస్పూను చొప్పున
  • ఉప్పు – రుచికి తగినంత
  • నిమ్మరసం – ఒక నిమ్మకాయంత
  • కొత్తిమీర తరుగు – పావు కప్పు

తయారుచేసే విధానం

1.ముందుగా బేబీ పొటాటోలను ఉడికించి, చల్లారిన తర్వాత తొక్క తీసి పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి ఎండు మిర్చి, కరివేపాకు, జీలకర్ర వేగించాలి.

2.ధనియాలపొడి, కారం, జీరాపొడి, గరం మసాల, ఆమ్‌చూర్‌, పసుపు, ఉప్పు వేసి చిన్నమంటపై మాడకుండా వేగించాలి.

3.తర్వాత బేబీ పొటాటోలను వేసి చిదిగిపోకుండా కలిపి ఆరేడు నిమిషాలు ఉంచాలి.

4.నిమ్మరసం పిండి అన్నీ కలిసేలా కడాయిని కిందకీ పైకీ కుదిపి కొత్తిమీర చల్లి దించేయాలి. ఇవి సాంబారన్నంలో సైడ్‌ డిష్‌గా అదిరిపోతాయి.

Related Articles