NewsWaves.news

చట్టానికి అతీతుడిని అనుకుంటున్న బాబు… రాంచంద్రయ్య

దేశం మొత్తం తన ఆధీనంలో ఉందని, చట్టానికి తాను మాత్రం అతీతుడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని ఆరోపించారు వైసిపి అధికార ప్రతినిధి సీ. రాంచంద్రయ్య.మొత్తం వ్యవస్థనే సర్వనాశనం చేసి తాను మాత్రం అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.ప్రతిసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన చంద్రబాబు ఆరోపణలు చేయడం చూస్తూ ఉంటే బోడి గుండుకు మోకాలికి సంబంధం పెట్టిన సామెత గుర్తుకొస్తోందని ఆయన ఆరోపించారు.

హరికృష్ణ శవాన్ని పక్కనపెట్టుకుని మరీ టిఆర్ఎస్ తో పొత్తు కోసం రాజకీయం చేసిన చంద్రబాబునాయుడు, రాజకీయంగా లబ్ది పొందడం కోసమే కొంతమంది అధికారులను తన తొత్తులుగా ఉపయోగించుకోవాలని చూశారని ఆరోపించారు. ఇక సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్,ఇన్కమ్టాక్స్ డిపార్ట్మెంట్ లు రాష్ట్రంలోకి రాకూడదు అని చెప్పడం చూస్తుంటే… కొత్త రాజ్యాంగాన్ని రచించినట్లుగా బాబు పనులు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు ఒక రాజ్యాంగేతర శక్తిగా మారారని తీవ్రంగా మండిపడ్డారు రామచంద్రయ్య.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి