NewsWaves.news

ఢిల్లీ టూర్ లో బాబు బిజీ…

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చాలా బిజీగా గడుపుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో సమావేశాలు నిర్వహించి, రాజకీయ కార్యాచరణ గురించి చంద్రబాబు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా బాబు సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులో బాబు సమావేశం అయ్యారు. తరువాత ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ అధ్యక్షుడు,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లారు. అక్కడ దాదాపు అరగంట పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

ఈ సమావేశాలలో ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చే పరిణామాలు, మోడీ వ్యతిరేక కూటమి ఏర్పాటు తదితర విషయాలను చర్చించినట్లు సమాచారం. మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు సంప్రదింపులు జరపడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లో కూడా ఆసక్తిగా మారింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి