NewsWaves.news

ఇండియన్ ఆర్మీ రెచ్చిపోయింది… కౌశల్ ఆర్మీ చచ్చిపోయింది…బాబు గోగినేని

బిగ్ బాస్ షో విజేతగా నిలిచిన కౌశల్ గెలుపుకు ప్రధాన కారణం కౌశల్ ఆర్మీ.కౌశల్ ని చిన్న మాట అన్నా కూడా వాళ్ళని దారుణంగా ట్రోల్ చేస్తూ చివరికి బిగ్ బాస్ షో ని తమ కంట్రోల్ లోకి తెచ్చుకుని, తమ ఫేవరెట్ కంటెస్టెంట్ అయిన కౌశల్ ని గెలిపించుకుంది ఈ ఆర్మీ. అయితే ఇంతవరకు కౌశల్ కి అండగా నిలిచిన ఆర్మీ ఇప్పుడు కౌశల్ పై తిరుగుబాటు చేస్తుంది. కౌశల్ స్వార్థపరుడు అని, డబ్బు మనిషి అని,అభిమానుల పట్ల ఎలాంటి ఆదరణ చూపడం లేదని, కౌశల్ ఫౌండేషన్ కి వస్తున్న డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని, అసభ్యకరమైన ట్రోలింగ్ చేసేలా కౌశల్,ఆయన భార్య నీలిమ ప్రోత్సహిస్తారు అంటూ…

కౌశల్ ఆర్మీ లో ఉన్న ప్రధానమైన గ్రూపులకి సంబంధించిన అడ్మిన్ లు మీడియా ముఖంగా కౌశల్ అలాగే ఆయన భార్య పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాగా బిగ్ బాస్ షో మొదటి నుంచి కూడా కౌశల్ గేమ్ సరిగా ఆడట్లేదని, ఆయన అబద్దాల కోరు అని, మోసగాడు అని విమర్శిస్తున్న బాబు గోగినేని ఈ విషయం పట్ల స్పందించారు. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ పాక్ భూభాగంలోకి యుద్ధవిమానాలను పంపడంపై కూడా ఆయన స్పందించారు. “రెండు శుభవార్తలు విన్నానని.. ఎంతోకాలంగా మన దేశం పైన ఉగ్రవాద దాడులు చేస్తున్న పాకిస్తాన్ భూభాగం పైకి మన వీర సైన్యం వెళ్ళడం, వాళ్ళ మదం అణచడం మనం చూశామని..

ఇండియన్ ఆర్మీ రెచ్చిపోయిందని…అలాగే ఇంతకాలం అందర్నీ ఇబ్బంది పెడుతూ, చికాకుపెడుతున్న బెదిరిస్తూ,నేరపూరితంగా ప్రవర్తిస్తూ వస్తున్న కౌశల్ ఆర్మీ చచ్చిపోయిందని..” బాబు గోగినేని వ్యాఖ్యానించారు.అంతే కాదు దేశంలో ఎన్నో అత్యాచారాలు, హత్యలు, హక్కులను కాలరాసే సంఘటనలు జరుగుతున్నప్పటికీ స్పందించని వారు, కేవలం కిరీటి కౌశల్ పై నిమ్మకాయ నిమ్మకాయ పిం డినంత మాత్రానికి ఏకంగా ఒక ఆర్మీ పుట్టుకొచ్చింది అంటూ.. ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా నిజా నిజాల గురించి ప్రజలు ఆలోచించాలి అంటూ ఒక వీడియో ద్వారా పిలుపునిచ్చారు బాబు గోగినేని.

Related Articles