NewsWaves.news

కామాంధుడిని ప‌ట్టుకోవ‌డం కోసం చింపాంజి వేషం వేసిన పోలిస్‌

అమ్మాయిలతో వెకిలి చేష్ట‌లు చేసే కామాంధుడి ఆట ప‌ట్టించింది ఒక పోలిస్ ఆఫీస‌ర్‌. అందుకోసం ఆమె చింపాంజి వేషం వేసి పార్కులో చాలా స‌మ‌యం వేచి చూసింది. చివ‌రికి ఒక రోజు ఆ కామాంధుడిని క్యాచ్ చేసి కారాగారంలో ప‌డేసింది. వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియాలో యాపిల్ క్రాస్ అనే ప్రాంతంలో ఒక వ్య‌క్తి డైలీ కొత్త అమ్మాయితో ఒక‌ పార్క్‌లోకి వ‌చ్చేవాడ‌ట‌.

ఈ విష‌యం గ‌మ‌నించిన ఒక లేడీ కానిస్టేబుల్‌.. విష‌యం ఏంట‌ని క‌నుక్కోవాల‌ని నిర్ణ‌యించుకుంది. అంతే వెంట‌నే చింపాంజి డ్రెస్ వేసుకుని అత‌ని కోసం పార్క్‌లో వెయిట్ చేసింద‌ట‌. ఫైన‌ల్‌గా అత‌ను పార్క్ లోకి రావ‌డం.. వెంట‌నే ఆమె త‌న టీమ్‌ను రంగంలోకి దింప‌డం.. వాళ్లు అత‌న్నిఅదుపులో తీసుకోవ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి.

ఇంత‌కి ఆమె చింపాంజి మాస్క్ ఎందుకు వేసుకుందనేగా మీ సందేహం… వాడి హిస్ట‌రీ తెలుసుకున్న పోలీస్ ఆఫీస‌ర్‌…త‌నకు భ‌విష్య‌త్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అలా చేసింద‌ట‌.

Related Articles