NewsWaves.news

టీ20 లో భారత్ ఓటమి

హోరాహోరీగా సాగిన రెండవ టీ20 లో భారత్ ఓటమి పాలైంది. బెంగళూరు వేదికగా ఆసీస్,భారత్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 72 పరుగులతో చెలరేగగా, రాహుల్‌ 47, ధోని 40 పరుగులతో జట్టుకు భారీ స్కోర్ ను సాధించి పెట్టారు.

191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారు జట్టు ఆరంభంలోనే స్టాయినిస్‌, ఫించ్‌ ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ మాక్స్ వెల్ విధ్వంసకర బ్యాటింగ్ తో మ్యాచ్ ఆసీస్ వైపు తిరిగింది. కేవలం 55 బంతుల్లో 113 పరుగులతో నాటౌట్ గా నిలిచిన మాక్స్ వెల్ 9 సిక్సులు, 7 ఫోర్లతో బౌండరీల మోత మోగించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’
అవార్డు గెలుచుకున్నాడు.

Related Articles