NewsWaves.news

స‌ల్మాన్ సినిమా నుంచి పాకిస్తాన్ సింగ‌ర్ ఔట్‌

పుల్వామా ఉగ్ర‌దాడి త‌రువాత పాకిస్తానీ నటీన‌టులు, క‌ళాకారుల‌పై ఆలిండియా సినీ వ‌ర్క‌ర్స్ ఆసోసియేష‌న్ బ్యాన్ విధించిన విష‌యం తెలిసిందే. ఎవ‌రైనా ఈ అదేశాల‌ను అతిక్ర‌మిస్తే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం అని అసోసియేషన్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో పాకిస్తానీ న‌టీనటుల‌ను త‌మ సినిమాల్లోంచి తీసేసి వేరే వ్య‌క్తుల‌తో రీప్లేస్ చేస్తున్నారు దర్శ‌క నిర్మాత‌లు.

తాజాగా తాను ప్రొడ్యూస్ చేస్తున్న నోట్ బుక్ అనే సినిమాలో పాట పాడ‌నున్న ఆతిఫ్ అస్ల‌మ్‌ను తొల‌గించాడ‌ట స‌ల్మాన్ ఖాన్‌. ఆతిఫ్ స్థానంలో అర్మాన్ మ‌లిక్‌ను రీప్లేస్ చేశార‌ట‌. నోట్‌బుక్‌లో జ‌హీర్ ఇక్బాల్‌, ప్ర‌నూత‌న్ భల్ న‌టిస్తున్నారు. ఈ మూవీ మార్చి 29న విడుద‌ల కానుంది. స‌ల్మాన్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం భ‌ర‌త్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ మూవీ రంజాన్ సీజ‌న్‌లో విడుద‌ల కానుంది.

Related Articles